ఆలిండియా సీనియర్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి అజిత్ అగార్కర్ దిగిపోతున్నాడు. అక్టోబర్ 4వ తేదీతో ముగియనున్న తన కాంట్రాక్ట్ పొడిగింపును కోరకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అజిత్ ఇప్పటికే బోర్డుకు స్పష్టం చేయడంతో వారు కొత్త చీఫ్ సెలెక్టర్‌ను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. 2023 జూలైలో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో భారత జట్టు రెండు ఆసియా కప్‌లు (2023, 25), రెండు టీ20 ప్రపంచకప్‌లు (2024, 26), గతేడాది చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది