Kaizer News

హౌతీలతో అమెరికా రహస్య ఒప్పందం?

హౌతీలతో అమెరికా రహస్య ఒప్పందం?

· National - India · ntnews.com

మస్కట్‌ : యెమెన్‌లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు మరో షాక్‌ తగిలింది. ఒమన్‌ రాజధాని మస్కట్‌లో ఇరాన్‌ మద్దతున్న హౌతీలతో అమెరికా రహస్యంగా చర్చలు జరపడం సంచలనంగా మారింది. ఇప్పటికే హౌతీ లు వ్యూహాత్మక బాబ్‌ ఎల్‌-మాబ్‌ జలసంధిలో పట్టు పెంచుకున్నారు. సౌదీ చమురు ఎగుమతులతో పాటు ప్రపంచ వాణిజ్యానికి ఈ మార్గం కీలకం. ఇలాంటి సమయంతో సౌదీ మిత్ర దేశమైన యూఎస్‌ హౌతీలతో చర్చలు జరుపుతున్నట్టు జేడీ వాన్స్‌ తెలిపారు. మస్కట్‌లో రహస్యంగా ఒప్పందం జరిగినట్టు రాయిటర్స్‌ కథనం తెలిపింది. ఈ చర్చల్లో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల కాల్పుల విరమణ, యూఎస్‌, ఇజ్రాయెల్‌ నౌకలపై దాడులు చేయబోమని హౌతీలు హామీ ఇవ్వడంతో పాటు సౌదీపై దాడులు కొనసాగించడం లాంటివి ఉన్నాయని రాయిటర్స్‌ వెల్లడించింది

Original source: ntnews.com
Read more on Kaizer News