Kaizer News

నేడు పెబ్బేరుకు కేటీఆర్‌

నేడు పెబ్బేరుకు కేటీఆర్‌

· State - Telangana · ntnews.com

సాగు నీరు, కరెంట్‌ కోతలపై రైతులతో మాటామంతి పెబ్బేరు, సెప్టెంబర్‌ 18 : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరుకు రానున్నారు. కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించి తిరుగు ప్రయాణంలో ఆయన పెబ్బే రు మండలం గుమ్మడం క్రాస్‌ రోడ్డు వద్ద ఆగి రైతులతో మాట్లాడుతారు. సాగు నీరు, కరెంట్‌ కోతలతో సతమతమవుతున్న నేపథ్యంలో రైతులను ప్రత్యక్షంగా కలువనున్నారు. తర్వాత కొల్లాపూర్‌ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని మీడియా సెల్‌ జిల్లా కన్వీనర్‌ అశోక్‌ తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News