Kaizer News

Kurnool: పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ

Kurnool: పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ: కలెక్టర్ సిరి

· State - Telangana · hmtvlive.com

Shorts కర్నూలు: జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను గుర్తించి, ఆయా పరిశ్రమల భాగస్వామ్యంతోనే శిక్షణ అందించి, అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు.. శనివారం కలెక్టర్ కార్యాలయంలో విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలు, ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను ముందుగా గుర్తించాలని, వాటికి అనుగుణంగా యువతకు శిక్షణ అందించి, శిక్షణ పూర్తైన వెంటనే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు... ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా 10 రోజుల్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. CSR ద్వారా నిర్మించిన సీడాప్‌ భవనాలు, ఐటీఐల్లోని APSSDC స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను అవసరమైన సంస్థలకు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు వస్తున్న సంస్థల మానవ వనరుల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా స్థానిక యువతకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేసి రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలపాలన్నారు.. PMKVY (ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన) కింద వచ్చిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ఇప్పటికే ప్రారంభించిన బ్యాచ్‌లను వేగవంతంగా పూర్తి చేసి తదుపరి బ్యాచ్‌లను ప్రారంభించాలన్నారు.. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (BOC)లో ఇప్పటికే నమోదైన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, మేసన్లు తదితర కార్మికులకు నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. ముఖ్యంగా సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్ వంటి డిమాండ్ ఉన్న నైపుణ్యాలను కూడా శిక్షణలో చేర్చి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు.. జాబ్ మేళాల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్యను మరింత పెంచాలని, ముఖ్యంగా తక్కువగా యువత పాల్గొంటున్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. అన్ని కళాశాలల్లో నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, జాబ్ మేళాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని, డిసెంబర్ నాటికి 100 శాతం రిజిస్ట్రేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఉపాధి కల్పన అధికారిని ఆదేశించారు.. జిల్లాలోని 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల 10వ తరగతి ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన యువత అమరరాజా బ్యాటరీస్ సంస్థ అందిస్తున్న నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. విద్యార్థుల హాజరు, అకడమిక్ స్టార్ రేటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లాలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అధ

Original source: hmtvlive.com
Read more on Kaizer News