Kaizer News

మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ షో

మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ షో

· Sports · sakshi.com

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్‌ఫాస్ట్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. తాజాగా అమ్‌స్టర్‌డామ్‌ ఫ్లేమ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో అదరగొట్టిన అతడు.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమ్‌స్టర్‌డామ్‌ను మ్యాక్స్‌వెల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో (4-0-18-4) 133 పరుగులకే కుప్పకూల్చాడు. అతడికి మాథ్యూ హంఫ్రేస్‌ (4-0-22-3) సహకరించాడు. అమ్‌స్టర్‌డామ్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెల్‌ఫాస్ట్‌ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి లోర్కన్‌ టక్కర్‌ (34 నాటౌట్‌), డెవాన్‌ కాన్వే (35) సహకరించారు. ఇవాళ జరిగే తుదిపోరులో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్.. ఎడిన్‌బర్గ్ క్యాజిల్ రాకర్స్‌తో తలపడనుంది. ఇదీ చదవండి: టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్ల ప్రకటన ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News