Vahan Portal : వాహన యజమానులకు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి కేంద్ర రవాణా శాఖ ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. తమ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లో ప్రస్తుత మొబైల్ నంబర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఇంట్లో నుంచే చాలా సులభంగా ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా ఈ పని పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వాహన రికార్డులను సరిగ్గా ఉంచడంతో పాటు, ట్రాఫిక్ పోలీసులు వేసే ఈ-చలానాలు, ఇన్సూరెన్స్ రెన్యూవల్ డేట్స్ , ఇతర నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మొబైల్‌కే నేరుగా రావడానికి ఈ అప్‌డేట్ చాలా అవసరం. మీ వాహనం ఆర్‌సీ డాక్యుమెంట్లలో కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘వాహన్’ (Vahan) పోర్టల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పరివాహన్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి, అందులో వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్టేట్ , మీ ఏరియా ఆర్‌టీఓను ఎంచుకుని ముందుకు వెళితే, మొబైల్ నంబర్ అప్‌డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ , ఆర్‌సీ డేట్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్‌లో వివరాలు మ్యాచ్ అయిన వెంటనే కొత్త మొబైల్ నంబర్ టైప్ చేస్తే, ఆ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేయగానే మీ ఆర్‌సీలో కొత్త మొబైల్ నంబర్ సక్సెస్ ఫుల్‌గా అప్‌డేట్ అయిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్‌లో నంబర్ చేంజ్ చేసే ప్రాసెస్ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్ మార్చాలనుకునే వారు ‘సారథి’ (Sarathi) పోర్టల్‌ను వాడాలి. పరివాహన్ సైట్‌లో డ్రైవర్స్ లేదా లెర్నర్స్ లైసెన్స్ సెక్షన్‌లోకి వెళ్ళి మీ స్టేట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మెనూ బార్‌లో అదర్స్ ఆప్షన్ కింద అప్‌డేట్ మొబైల్ నంబర్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ వెంటనే మీ లైసెన్స్ డీటైల్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. సమాచారం అంతా కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకున్నాక, మీ కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నంబర్‌కు వచ్చే ఓటీపీని కన్ఫర్మ్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్‌కి కొత్త నంబర్ లింక్ అయిపోతుంది. చాలామంది పాత నంబర్లు లేదా ప్రెసెంట్ వాడని నంబర్లను ఆర్‌సీ, లైసెన్స్‌లకు ఇచ్చి వదిలేస్తుంటారు. దీనివల్ల ట్రాఫిక్ చలానాలు పడినప్పుడు లేదా ఇన్సూరెన్స్ గడువు ముగుస్తున్నప్పుడు ఎలాంటి మెసేజ్‌లు రావు. పొల్యూషన్ టెస్ట్ మెసేజ్‌లు, వెహికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ అలర్ట్స్ కూడా మిస్ అయిపోతుంటాయి. టైమ్‌కి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల అనవసరంగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే వెంటనే మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం మంచిది. అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స