Kaizer News

రింకూ సింగ్‌ ఒంటరి పోరాటం

రింకూ సింగ్‌ ఒంటరి పోరాటం

· Sports · sakshi.com

బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అదరగొట్టారు. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. వీరి ధాటికి సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌కు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తొలి రోజు ఆట ఆరంభంలోనే గాయపడటంతో జట్టును నడిపించే బాధ్యతను వైభవ్ తన భుజాన వేసుకున్నాడు. మరోవైపు సౌత్‌జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్‌జోన్‌ త​మ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది. విద్వత్ కావేరప్ప నాలుగు వికెట్లు పడగొట్టి నార్త్‌జోన్‌ పతనాన్ని శాసించాడు. ఖమ్రాన్ ఇక్బాల్(76) టాప్‌ స్కోరర్‌గా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్‌ జోన్‌ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో జగదీశన్‌(340, తిలక్‌ వర్మ(1)ఉన్నారు. చదవండి : అంపైర్‌కే షాక్ ఇచ్చిన వైభవ్‌ సూర్యవంశీ.. 3 సెకెన్లలో! వీడియో వైరల్‌ హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News