రోజూ చేసే వంటలతో బోర్ కొట్టిందా? అయితే కాస్త వెరైటీగా, రుచిగా ఉండే ఈ నాలుగు వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. క్రిస్పీ ఆలూ సూజీ పూరీ నుంచి నోరూరించే భర్వాన్ కరేలా వరకు.. ఒక్కో వంటకం ఒక్కో ప్రత్యేక రుచిని అందిస్తుంది. క్రిస్పీ ఆలూ సూజీ పూరీ కావలసినవి.. బంగాళాదుంపలు: 2, సూజీ రవ్వ: కప్పు, గోధుమపిండి: అర కప్పు, పచ్చిమిర్చి: 2, కొత్తిమీర: కొద్దిగా, కారం: హాఫ్ టీస్పూన్, జీలకర్ర: హాఫ్ టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి. తయారీ.. - ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి, రవ్వ, గోధుమపిండి, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. - కొద్దికొద్దిగా నీరు పోస్తూ గట్టిగా పిండిని కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి. - చిన్న ఉండలు చేసి పూరీల్లా ఒత్తాలి. - వేడినూనెలో మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. - వేడివేడిగా ఆలూ కర్రీ లేదా పెరుగుతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది. ఖర్ వాంగ్.. కావలసినవి.. వంకాయలు: 6, వేరుశెనగలు: అర కప్పు, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, ధనియాలు: టేబుల్ స్పూన్, జీలకర్ర: టీస్పూన్, పచ్చిమిర్చి: 2, వెల్లుల్లి: 5 రెబ్బలు, అల్లం: చిన్న ముక్క, ఎండుకొబ్బరి: కొద్దిగా, ఉప్పు, పసుపు, కారం: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు. తయారీ.. - వేరుశెనగలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కొబ్బరిని వేయించి పొడిగా చేసుకోవాలి. - వంకాయలను మధ్యలో చీల్చి ఈ మసాలాను నింపాలి. - బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వంకాయలను జాగ్రత్తగా ఉంచాలి. - కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి. - చివర్లో మిగిలిన మసాలా, ఉప్పు, కారం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికిస్తే మంచి రుచితో ఖర్ వాంగ్ సిద్ధం. ఆలూ కుల్ఫీ సమోసా కావలసినవి.. సమోసా షీట్లు: 6, ఉడికించిన బంగాళాదుంపలు: 2, పచ్చిమిర్చి: 2, కొత్తిమీర: కొద్దిగా, కారం: హాఫ్ టీస్పూన్, గరం మసాలా: హాఫ్ టీస్పూన్, జీలకర్ర: హాఫ్ టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి. తయారీ.. - ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు కలపాలి. - సమోసా షీట్‌ను కుల్ఫీ ఆకారంలో చేసి, ఆలూ మిశ్రమాన్ని నింపి అంచులను చక్కగా మూసివేయాలి. - వేడినూనెలో మీడియం ఫ్లేమ్‌పై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. - అంతే వేడివేడి ఆలూ కుల్ఫీ సమోసా రెడీ! వీటిని టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే రుచికరంగా ఉంటాయి. భర్వాన్ కరేలా.. కావలసినవి.. కాకరకాయలు: 5, ఉల్లిపాయలు: 2, వేరుశెనగ పొడి: 2 టేబుల్‌స్పూన్లు, ధనియాల పొడి: టీస్పూన్, కారం: టీస్పూన్, పసుపు: కొద్దిగా, ఆమ్చూర్ పొడి: హాఫ్ టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు. తయారీ.. - కాకరకాయలను శుభ్రంగా కడిగి మధ్యలో చీల్చి గింజలు తీసేయాలి. - ఉల్లిపాయలు, వేరుశెనగ పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఆమ్చూర్, ఉప్పు కలిపి మసాలా సిద్ధం చేసుకోవాలి. - ఈ మసాలాను కాకరకాయల్లో నింపాలి. - బాణలిలో నూనె వేడి చేసి కాకరకాయలను వేసి మూతపెట్టి తక్కువ మంటపై మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. - మధ్యమధ్యలో తిప్పుతూ బంగార