Kaizer News

నల్గొండ జిల్లా లో హైవేపై ట్రాఫిక్ జామ్.. చిట్యాల ట

నల్గొండ జిల్లా లో హైవేపై ట్రాఫిక్ జామ్.. చిట్యాల టూ నార్కెట్ పల్లి బారులు తీరిన వాహనాలు

· State - Telangana · v6velugu.com

హైవే65పై నల్గొండ జిల్లా చిట్యాల నుంచి నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి వరకు 8 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. రాఖీ పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీనికితోడు చిట్యాల పట్టణ పరిధిలో హైవే ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ పనులు జరుగుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో చిక్కుకున్నారు. పోలీసులు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాలను ముందుకు పంపించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ ప్లాజా వద్ద కిలో మీటర్​ మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు

Original source: v6velugu.com
Read more on Kaizer News