Off The Record: దామచర్ల జనార్దన్. ఒంగోలు ఎమ్మెల్యే. ఒంగోలు ప్రజలు ఆయనను DJ అని పిలుచుకుంటారు. అదే సమయంలో... "ఒంగోలు అభివృద్ధి ప్రదాత" అంటూ దామచర్లకు ఒక గుర్తింపు ఇచ్చారు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. దీనికి కారణం లేకపోలేదు..! 2014లో తొలిసారి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్... నగర అభివృద్ధి, సుందరీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో... అప్పట్లోనే దామచర్లకు "ఒంగోలు అభివృద్ధి ప్రదాత" అనే పేరు వచ్చిందన్నది టీడీపీ వర్గాల వాదన. 2024లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత... నగర సుందరీకరణపై మరింత ఫోకస్ పెట్టారు దామచర్ల. నగరాన్ని రంగులమయం చేస్తూ...పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నారా లోకేష్ ఒంగోలులో పర్యటించారు. అనంతరం... ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. లోకేష్ కార్యకర్తల సమావేశం... ఒంగోలు టీడీపీ క్యాడర్‌లో కొత్త జోష్ నింపింది..! పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు టీడీపీ ఎలా అండగా ఉంటుందో వివరించిన లోకేష్...పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పదవులు, బాధ్యతలు ఇచ్చి ఎలా గౌరవిస్తుందో వివరించారు. పార్టీ కోసం కష్టపడితే... అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఎలా వస్తుందో కూడా క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని... టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు చిన్నచిన్న విషయాలకు మనస్పర్థలు తెచ్చుకోవద్దని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో... కూటమి పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగేందుకు కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.అయితే... ఈ సమావేశంలో లోకేష్ చేసిన మరో కామెంట్ మాత్రం ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో అసలు హాట్ టాపిక్‌గా మారింది..! కార్యక్రమం ప్రారంభంలోనే... ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను నారా లోకేష్ ఓ రేంజ్‌లో పొగిడారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తి DJ అని...అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ లైన్ ప్రకారం పనిచేసే నాయకుడు దామచర్ల జనార్దన్ అని క్యాడర్‌కు వివరించారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం దామచర్ల ఎప్పుడూ తనను కలుస్తూ ఉంటారని...ఒంగోలు అభివృద్ధి గురించే తనతో మాట్లాడుతుంటారని కూడా చెప్పారు. 2014కు ముందు ఒంగోలు ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉంది..? అని ప్రజలు గమనించాలని సూచించిన లోకేష్... ఒంగోలు అభివృద్ధిలో దామచర్ల పాత్రను ప్రస్తావించారు. ఇంతవరకు ఒక ఎత్తు..! కానీ... ఆ తర్వాత లోకేష్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి..! చూడటానికి దామచర్ల చాలా సైలెంట్‌గా కనిపిస్తారు... కానీ DJ జోలికి వస్తే దబిడిదిబిడే..! అంతేకాదు... "DJ జోలికి ఎవరైనా వస్తే... DJనే!" అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో వైరల్ టాపిక్‌గా మారాయి. ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ మొదలైంది..! లోకేష్ ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు..? ఎవ