Kaizer News

భారత్‌ -0 కొరియా-2

భారత్‌ -0 కొరియా-2

· National - India · ntnews.com

సియోల్‌: డేవిస్‌ కప్‌లో ఫైనల్‌8 బెర్తును దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత టెన్నిస్‌ జట్టుకు తొలిరోజే నిరాశ ఎదురైంది. కొరియాతో క్వాలిఫయర్స్‌ ఈవెంట్‌లో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌ మ్యాచులోనూ ఓడి 0-2తో డీలాపడింది. తొలుత దక్షిణేశ్వర్‌ సురేశ్‌ 6-3, 3-6, 4-6తో కొరియా నంబర్‌.1 సన్‌వో క్వాన్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో సింగ్సిల్‌లో సుమిత్‌ నగాల్‌ 6-2, 4-6, 5-7తో హెయాన్‌ ముందు తేలిపోయాడు. శనివారం జరిగే డబుల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌లో గెలిస్తేనే భారత్‌ నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది

Original source: ntnews.com
Read more on Kaizer News