Kaizer News

సిర్పూర్ (యు)లో ఘనంగా మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు

సిర్పూర్ (యు)లో ఘనంగా మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు వర్ధంతి

· State - Telangana · prabhanews.com

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: ఆదివాసీ తొలి పట్టభద్రుడు, మాజీ గిరిజన శాఖ మంత్రి, ఆదివాసీల ముద్దుబిడ్డగా పేరొందిన స్వర్గీయ కొట్నాక్ భీంరావు 24వ వర్ధంతి వేడుకలను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు విగ్రహానికి జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, సర్పంచులు, ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆత్రం భగవంతరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిర్పూర్ (యు) గ్రామ పటేల్ ఆత్రం ఆనందరావు, మాజీ ఎంపీపీ తొడసం విజయలక్ష్మి, సిర్పూర్ (యు) సర్పంచ్ ఆత్రం ఓం ప్రకాష్, బాండేర్ సర్పంచ్ కుమ్ర భీంరావు, రాయి సెంటర్ సర్ మేడి ఆనందరావు, దంతనపల్లి ఉప సర్పంచ్ మొహమ్మద్ మోబిన్, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News