Kaizer News

Kadapa: పెద్దముడియంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Kadapa: పెద్దముడియంలో ఉచిత కంటి వైద్య శిబిరం

· State - Telangana · hmtvlive.com

Shorts కడప: కడప జిల్లా పెద్దముడియం మండల కేంద్రంలో ప్రత్యేక కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం పెద్దముడియంలోని పార్క్‌లో పుష్పగిరి కంటి ఆసుపత్రి, కడప వారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుర్రప్ప, రామ సుబ్బారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News