Kaizer News

24వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

24వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

· State - Telangana · prabhanews.com

ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో పనులు.. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సూచించిన వైస్‌ చైర్మన్‌ వికారాబాద్‌, ఆంధ్రప్రభ: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 24వ వార్డు శివాజీనగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ రుచిత సాయిచరణ్‌రెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు.ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో సీసీ రోడ్డు పనులు చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి అన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయిచరణ్‌రెడ్డి, పట్టణ బీజేపీ అధ్యక్షురాలు శిరీష, సీనియర్‌ నాయకుడు కె.పి. రాజు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News