Kaizer News

Thoguta: హామీలు పక్కనపెట్టి రేవంత్ డైవర్షన్లు: బీఆ

Thoguta: హామీలు పక్కనపెట్టి రేవంత్ డైవర్షన్లు: బీఆర్‌ఎస్ జీడిపల్లి రాంరెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts Thoguta: ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ లు, 420 ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డైవర్షన్లతో కాలయాపన చేస్తోందని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట జిల్లా తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు. తొగుట లో బి ఆర్ ఎస్ నాయకులు సుతారి రమేష్, చంద స్వామి తో కలిసి మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వొచ్చి 1,000 రోజుల పాలన పూర్తవుతున్నా హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజలు ఎన్నికల హామీల కోసం నిలదీస్తుంటే, మెడిగడ్డ, కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్, హైడ్రా, ఫార్మా విలేజ్, మూసీ, ఫామ్‌హౌస్‌, భూముల అంశాలను ముందుకు తెచ్చి ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.“డైవర్షన్లతో కాలం గడిపినా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News