Kaizer News

చంద్రబాబు ఆదేశాలూ బేఖాతర్ ? ఈసారి రెవెన్యూ మంత్రిక

చంద్రబాబు ఆదేశాలూ బేఖాతర్ ? ఈసారి రెవెన్యూ మంత్రికి షాక్..!

· State - Telangana · telugu.oneindia.com

ఏపీలో కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు (Chandrababu) నాయకత్వం వహిస్తున్నారు. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. రాష్ట్రంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు వీరిద్దరితో పాటు సంబంధిత శాఖల మంత్రుల ఫొటోల్ని ప్రోటోకాల్ ప్రకారం ప్రకటనలపై ముద్రించాలి. కానీ చంద్రబాబు , మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేదా ప్రధాని మోడీ ఫొటోల్ని మాత్రమే అధికారిక ప్రకటనలపై ముద్రిస్తూ, సంబంధిత మంత్రుల్ని మాత్రం వదిలేస్తున్నారు. దీనిపై మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే స్పందించి, చంద్రబాబు కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉంటే సరిపోతుందిగా.. మిగతా మంతుల్ని తీసేస్తే ఖర్చైనా మిగులుతుందని సెటైర్లు కూడా వేశారు. చంద్రబాబును టార్గెట్ చేస్తున్న మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు-టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్..! ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో ఈ మధ్యే జరిగిన వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 ప్రారంభోత్సవం, అనకాపల్లికి గోదావరి జలాలు తీసుకెళ్లే కార్యక్రమాల ప్రకటనల్లో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో లేకపోవడంపై వస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగితే ఊరుకునేది లేదంటూ మంత్రులు, అధికారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఇకపై సీఎంగా చంద్రబాబుతో పాటు సంబంధిత శాఖ మంత్రి ఫొటో ఆయా కార్యక్రమాల ప్రకటనల్లో కనిపిస్తుందని అంతా భావించారు. కానీ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ఇచ్చిన యాడ్ లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫొటో లేదు. దీంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అయితే ఈసారి చంద్రబాబు ఆదేశాల్నీ పట్టించుకోరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. Recommended For You కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం అలా చేయొద్దు..! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు..! మంచి మనిషికో మాట, ……………… అంటారు మళ్లీ అదే సీను - రెవిన్యూ మంత్రి ఫోటో ఉండదు పరిపాలన మీద పట్టు తప్పి పోయినట్లుంది pic.twitter.com/CRFIHp9jfe ఈ నేపథ్యంలో గతంలో ఇదే అంశంపై ప్రశ్నలు లేవనెత్తిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB venkateswara Rao) స్పందించారు. మంచి మనిషికో మాట.. అంటారు అంటూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో తాజాగా ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన అధికారిక ప్రకటన పోస్టర్ ను షేర్ చేశారు. మళ్లీ అదే సీను - రెవిన్యూ మంత్రి ఫోటో ఉండదు .. పరిపాలన మీద పట్టు తప్పి పోయినట్లుంది అంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు చెప్పినా అధికారులు స్పందించడం లేదన్న అర్దం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News