Kaizer News

వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవం

వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవంత్ కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సూచన.. సీఎం షాకింగ్ రిప్లై

· State - Telangana · telugu.oneindia.com

వరంగల్ మామునూరులో నూతనంగా ఏర్పాటవుతున్న ఎయిర్‌ పోర్టుకు ఏం పేరు పెట్టాలో సూచించాలని తాజాగా సీఎం రేవంత్​రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి వరంగల్ ప్రజల కలను నెరవేర్చడంలో విఫలమైంది. బీఆర్ఎస్ నేతలు ప్రజల గురించి పట్టించుకోలేదు. వారి సౌఖ్యాల కోసం ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజాపాలనలో పేదల కల నెరవేరింది. తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ కోసం రూ. 295 కోట్లను కేటాయించింది. ఇప్పటికే అవసరమైన భూమిని స్వాధీనం చేసుకుని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాం.. ఇది కేవలం ఎయిర్ పోర్ట్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ, టూరిజం, ఎడ్యూకేషన్, జాబ్స్ అలాగే పెట్టుబడులకు గేట్ వే లాంటిది. మామునూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మేరకు వరంగల్ ఎయిర్ పోర్టుకు ఓ పేరును సూచించండి అని సీఎం రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో స్పష్టం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కు తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పలు సూచనలు చేశారు. సందీప్ రెడ్డి వంగా సొంతూరు వరంగల్ కావడంతో తన సొంత ఊరికి ఎయిర్ పోర్టు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కల నిజం కాబోతుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ ఎయిర్‌పోర్టుకు 'రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్' లేదా 'కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్' అనే పేర్లు పెట్టాలని సూచనలు చేశారు. వరంగల్‌ కు వేల సంవత్సరాల నుంచి ఉన్న గొప్ప చరిత్ర, కాకతీయుల సంస్కృతి, వారసత్వం గుర్తుండిపోయేలా ఎయిర్‌ పోర్టుకు పేరు ఉండాలంటూ ఎక్స్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇక వరంగల్ లో ఎయిర్ పోర్టు పనులకు సంబంధించిన ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. సందీప్ రెడ్డి వంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఆయన పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. అయితే సందీప్ రెడ్డి వంగా పోస్టుకు సీఎం రేవంత్ రిప్లై ఇచ్చారు. దట్స్ ది స్పిరిట్ అంటూ సమాధానం ఇచ్చారు. దాంతో ఆయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అర్థం అవుతోంది. అలాగే ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో స్పిరిట్ అనే పదాన్ని వాడటం ఆశ్చర్యకరం

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News