జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ రెండో లైన్‌లో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా జవహర్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూన్నారు వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు... కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి 8వ వార్డు కౌన్సిలర్ బెజ్జల శ్యామల 27వ వార్డు కౌన్సిలర్ వాసాల స్వప్న రవి పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను అందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత 25 ఏళ్లుగా జవహర్ నగర్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ, ప్రతి ఏడాది భక్తి కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు