Kaizer News

దండాలయ్యా రీమిక్స్‌ అయ్యా?

దండాలయ్యా రీమిక్స్‌ అయ్యా?

· Entertainment · sakshi.com

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం: 47 – ఏకే47’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా వెంకటేష్‌ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘కూలీ నెం1’లోని పాపులర్‌ సాంగ్‌ ‘దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా’ను ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం రీమిక్స్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఈ పాటను రీమిక్స్‌ చేసినట్లయితే వెంకటేష్‌ అభిమానులకు మరోసారి ఫెస్టివల్‌ ఫీస్ట్‌ ఇచ్చినట్లు అవుతుందని చెప్పాచ్చు. మరి... వార్తల్లో ఉన్నట్లు ‘దండలయ్యా...’ని రీమిక్స్‌ చేస్తున్నారా? లేదా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 2న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఆ తేదీకి విడు దల కాకపోవచ్చని, అదే నెలలో 9 లేదా 16న విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News