Kaizer News

టెట్‌ రద్దు చేయాలని జాతా

· State - Telangana · sakshi.com

నగరి : ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని కోరుతూ శనివారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బైక్‌ జాతా నిర్వహించారు. ఓంశక్తి ఆలయం నుంచి బస్టాండ్‌ వరకు జాతా కొనసాగింది. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మణిగండన్‌ మాట్లాడుతూ టెట్‌ నుంచి ఇన్‌సర్వీస్‌ టీచర్లకు మినహాయింపు ఇవ్వకుంటే, సెప్టెంబరు 3న చలోవిజయవాడ చేపట్టనున్నట్టుతెలిపారు. స్పెషల్‌ టెట్‌లో సర్వీస్‌ టీచర్లందరికీ ఒకే కనీస అర్హత మార్కులు నిర్ణయించారని,. అలా కాకుండా ఏ సబ్జెక్టు వారికి ఆ సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 25 నుంచి 30 ఏళ్ల కిందట ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు కూడా టెట్‌ ఉత్తీర్ణులు కావాలని చెప్పడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి కె.వంశీ కృష్ణ మాట్లాడుతూ 2010 లకు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలంటే విద్యా హక్కు చట్టం సెక్షన్‌ 23(1)కు సవరణ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును సాకు గా చూపుతూ కనీసం ప్రయత్నం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క పాఠ్యాంశాలు బోధిస్తూ, ప్రభుత్వ నిర్వహిస్తున్న శిక్షణ, కాంప్లెక్స్‌ సమావేశాలకు హాజరవుతూ బోధనేతర పనులతో ఉపాధ్యాయులు సతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌ స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే సెప్టెంబరు 4వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించా రు. నేతలు రవీంద్రబాబు, జయరాజు, యువరాజు, జనార్ధన్‌, జాన్‌, హరి ప్రసాద్‌, సురేష్‌ బాబు, రూబ న్‌, సంతోష్‌, ప్రకాష్‌ శ్రీనివాసులు, కేతు విజయకుమార్‌, మహేష్‌, భాగ్యరాజ్‌ సుబ్రమణ్యం, హేమల త, రాజేంద్ర, బాలకృష్ణ, సురేష్‌ పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News