Kaizer News

కుటుంబ సభ్యులను ఓదార్చి నివాళులు అర్పించిన చల్లా ధ

కుటుంబ సభ్యులను ఓదార్చి నివాళులు అర్పించిన చల్లా ధర్మారెడ్డి

· State - Telangana · prabhanews.com

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. మండలంలోని నాగారం, వెంకటాపూర్ గ్రామాల్లో మృతుల కుటుంబాలను ఆయన కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నాగారం గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, చిట్టిరెడ్డి మల్లారెడ్డి, వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుక్కల నర్సయ్య, గుజ్జ నారాయణరావు కుటుంబ సభ్యులను చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ వైస్‌ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News