Kaizer News

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు.. ఒకే కుట

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు

· State - Telangana · ntnews.com

నల్లగొండ జిల్లా చెర్వుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఢీకొన్న అనంతరం కారు సుమారు 200 మీటర్లు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారికి నర్కెట్‌పల్లి అంబులెన్స్‌ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Original source: ntnews.com
Read more on Kaizer News