వెస్టిండీస్‌తో స్వదేశంలో వైట్-బాల్ సిరీస్ పూర్తి చేసుకున్న తర్వాత భారత క్రికెట్ జట్టు ఆల్-ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య కివీస్ జట్టుతో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లలో తలపడనుంది. అయితే వైట్-బాల్ మ్యాచ్‌లతో పోలిస్తే ఈ టూర్‌లో టెస్టు సిరీస్ భారత్‌కు అత్యంత కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఖచ్చితంగా కివీస్‌ను ఓడించాల్సి ఉంది. ఇందుకోసం టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. చివరి వన్డే ముగిసిన కేవలం మూడు రోజులకే మొదటి టెస్టు ప్రారంభం కానుంది. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు టెస్టు జట్టుకు ఎంపికైన ముఖ్య ఆటగాళ్లు చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరంతా వెల్లింగ్టన్‌లో జరిగే మొదటి టెస్టు కోసం ముందుగానే రెడ్-బాల్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. గిల్ గైర్హాజరీలో చివరి రెండు వన్డేలకు భారత జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టే అవకాశం ఉంది. గిల్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి ప్లేయర్లు కివీస్‌తో చివరి రెండు వన్డేలకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. టీ20 సిరీస్ షెడ్యూల్ తొలి టీ20: అక్టోబర్ 22 – క్రిస్ట్చర్చ్ (మధ్యాహ్నం 12:30) రెండో టీ20: అక్టోబర్ 24 – క్రిస్ట్చర్చ్ (మధ్యాహ్నం 12:30) మూడో టీ20: అక్టోబర్ 27- వెల్లింగ్టన్ (మధ్యాహ్నం 12:30) నాలుగో టీ20: అక్టోబర్ 30-ఆక్లాండ్ (మధ్యాహ్నం 12:30) ఐదో టీ20: నవంబర్ 1 – హామిల్టన్ (మధ్యాహ్నం 12:30) వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్ (ఉదయం 7:30) రెండో వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్ ((ఉదయం 7:30) మూడువ వన్డే: నవంబర్ 10 - హామిల్టన్ (ఉదయం 7:30) నాలుగో వన్డే: నవంబర్ 13 : మౌంట్ మాంగనుయ్ -ఆక్లాండ్ (ఉదయం 7:30) 5వ వన్డే: నవంబర్ 15 – మౌంట్ మాంగనుయ్ (బే ఓవల్) (ఉదయం 7:30) టెస్టు సిరీస్ తొలి టెస్టు: నవంబర్ 19 - నవంబర్ 23 – వెల్లింగ్టన్ (ఉదయం 3:30) రెండో టెస్టు: నవంబర్ 27 - డిసెంబర్ 1 – హ్యాగ్లే ఓవల్, క్రిస్ట్చర్చ్ (ఉదయం 3:30) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్