Kaizer News

Vinjamuru: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బర్త్‌డే: వింజమ

Vinjamuru: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బర్త్‌డే: వింజమూరులో పూజలు

· State - Telangana · hmtvlive.com

Shorts నెల్లూరు జిల్లా: ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వింజమూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వింజమూరులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.కాకర్ల సురేష్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని.. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లే శక్తి, ఆరోగ్యం ఆయనకు కలగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ... కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వింజమూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News