Kaizer News

Karimnagar: విద్యార్థులపై బీజేపీ మొసలి కన్నీరు కార

Karimnagar: విద్యార్థులపై బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోంది!

· State - Telangana · hmtvlive.com

Karimnagar: రాష్ట్రప్రభుత్వానికి రావలసిన నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలడ్డుకుంటూ విద్యార్థుల పై మొసలి కన్నీరు కారుస్తుందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి అంతకుముందున్న వంద శాతం నిధులను 60 శాతానికి కుదించి మిగితా 40 శాతానికి రాష్ట్రం పై భారం వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సంఘం నిధులు గతంలో లాగా 100 శాతం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి 20 శాతం భారం వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి రావాల్సిన పన్నులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ కి లేదని విద్యార్థులపై దమనకాండకు పాల్పడిన వారు విద్యార్థులపై మొసలి కన్నీరు కార్చుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News