Kaizer News

డబుల్ రోడ్డు కోసం గన్నేరువరంలో ధర్నా

డబుల్ రోడ్డు కోసం గన్నేరువరంలో ధర్నా

· State - Telangana · v6velugu.com

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం యువజన సంఘాలు నిరసనకు దిగాయి. వారికి అఖిలపక్షం నేతలు మద్దతు పలికారు. ఆందోళన చేస్తున్న నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, యువజన సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. యువజన సంఘాల అధ్యక్షుడు కాలువ నాగరాజు మాట్లాడుతూ.. రోడ్డు వేస్తానని చెప్పిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా పనులు చేపట్టలేదని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ అణిచి వేస్తున్నారని ఆరోపించారు. డబుల్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, గంప వెంకన్న, మచ్చ సాయి, మాడుగుల రవీందర్ రెడ్డి, ముత్యాల జగన్ రెడ్డి, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News