Kaizer News

Gannavaram: చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి

Gannavaram: చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి

· State - Telangana · hmtvlive.com

గన్నవరం: గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన చిరువ్యపారులకు ఏ జీవనాధారం చూపించకుండా అధికారులు వారిని నిర్బంధంగా కాలి చేయించారు. ఇది సరికాదు వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వారికి జీవనాధారం కొరకు ప్రత్యమనాయం స్థలం చూపించాలని వినతిపత్రం ఇచ్చిన గన్నవరం మండలం జెడ్పీటీసీ వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షులు అన్నవరపు ఎలిజబెత్ రాణి డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేసరపల్లి గ్రామంలో చేరువుచుట్టూ ప్రభుత్వ భూమిలో అనేకమంది దళిత గిరిజన వెనుకబడిన కుటుంబాలు వారు కొబ్బరి బొండాలు, టిపెన్ సెంటర్, కూరగాయలు, టి బడ్డీలు, తదితర చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు.వారికి ప్రత్యమనాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వందే నని జిల్లా కలెక్టర్ గారిని వినతి పత్రంలో కోరారు. గత రెండు రోజులు నుండి వారు ప్రతి రోజు చేసుకునే చిరు వ్యాపారం చేయనందున వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని తెలిపినట్లుచెప్పారు.ఇటువంటి పేదలను కాలి చేయించే ముందే ప్రత్యమనాయం చూపించి ఆ తరువాతే కాలి చేయించాలి. రాజ్యాంగంలో జీవించే హక్కు ప్రతి మనిషికి ఉందని ఆ హక్కును కాలారాయటం చట్టవిరుద్ధమేనని ఆమే అన్నారు.జీవించే హక్కును దెబ్బకొట్టటమేనని అన్నారు వీరి జీవనాధారం దెబ్బకొట్టడంపై కలెక్టర్ గారు విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆమే అన్నారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News