Kaizer News

జీవో 97ను రద్దు చేయాలి

జీవో 97ను రద్దు చేయాలి

· State - Telangana · ntnews.com

మధిర పాలిటెక్నిక్‌ కళాశాలలో వంటావార్పుతో నిరసన మధిరరూరల్‌, సెప్టెంబర్‌ 19 : జీవో 97కు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ పాలిటెక్నిక్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీపీజేఏసీ)పిలుపు మేరకు శనివారం కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కలిసి వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్యను నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ముడిపెట్టి విద్యావ్యవస్థను బలహీనపరచవద్దని, తక్షణమే జీవో 97 రద్దు చేసి పాలిటెక్నిక్‌ విభాగాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News