సీఎంఆర్ ధాన్యం కేటాయింపుల రికార్డుల పరిశీలన మిర్యాలగూడ, ఆంధ్రప్రభ: మిర్యాలగూడ మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఉన్న ఓ రైస్‌మిల్లులో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్ ధాన్యం కేటాయింపులకు సంబంధించిన అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. రైస్‌మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలు, కేటాయింపులకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది