Kaizer News

Station Ghanpur: ప్రతీ ఎకరానికి సాగు నీరే లక్ష్యం.

Station Ghanpur: ప్రతీ ఎకరానికి సాగు నీరే లక్ష్యం.. GO 97 రద్దు చేయాలి!

· State - Telangana · hmtvlive.com

Station Ghanpur: స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు పంట కాలువ ద్వారా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్బంగా తూము వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ. ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే లక్ష్యం. 2023 నవంబర్ లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో దేవాదుల కింద ఉన్న రిజర్వాయర్ల ద్వారా ప్రతీ గ్రామానికి సాగు నీరు అందించాలనే ఏకైక ఎజెండాతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లలో నీటిని నింపేందుకు గత రెండు నెలలుగా ప్రతీ రోజు ఎప్పటికప్పుడు పంపింగ్ ను పరిశీలస్తూ, అధికారులతో మాట్లాడుతూ గోదావరి నుండి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపి రైతుల పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని దానికి ఫలితాంగానే నేడు దేవాదుల కింద ఉన్న అన్ని రిజర్వాయర్ల నుండి సాగు నీరు విడుదల చేస్తున్నామని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 6నెలల్లో 100శాతం దేవాదుల పనులను పూర్తి చేసి నియోజకవర్గంలోని పూర్తి ఆయకట్టుకు సాగు నీరు అందిస్తానని స్పష్టం చేశారు. అందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, రైతులు, నాయకులు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. గతంలో సాగు నీటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నేను నాటిన మొక్క నేడు మహా వృక్షం అయి ఉమ్మడి వరంగల్ జిల్లాకే పెద్ద దిక్కుగా మారడం నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తి ఇచ్చే అంశం అని బావోద్వేగానికి లోనయ్యారు. ఘనపూర్ రిజర్వాయర్ కింద పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. 10ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణను ఏ రకంగా దోచుకుందో, తెలంగాణను ఏ రకంగా బ్రష్టు పట్టించిందో ప్రజలందరికి తెలుసని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించి పూర్తి చేశారని ఆ తర్వాత నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ కుంగిపోయిందని తెలిపారు. మెడిగడ్డ కుంగిపోయిన సమయంలో కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడని అందులో ఏమైనా అనుమానాలు ఉంటే అప్పుడే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మెడిగడ్డ నుండి 1టీఎంసి కూడా ఎత్తిపోయకుండా వరుసగా రెండు సంవత్సరాలు దేశంలోనే అత్యంత ఎక్కువ ధాన్యం దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గుర్తుచేశారు. బిఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములు, అసైండ్ భూములు, ప్రయివేట్ భూములను కోళ్లగొట్టారని, వందల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని....? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించా

Original source: hmtvlive.com
Read more on Kaizer News