Kaizer News

Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీప

Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?

· State - Telangana · telugu.abplive.com

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రాధాన్యం క్రమంగా తగ్గుతున్న క్రమంలో, ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు గుడ్‌బై చెబుతూ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన వెంటనే నేరుగా టీడీపీ గూటికి చేరడం చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షం నుంచి బయటకు వస్తున్న నేతలకు కూటమి రూపంలో రెండు వేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ, మెజారిటీ నాయకులు జనసేన వైపు చూడకుండా కేవలం తెలుగుదేశం వైపే మొగ్గు చూపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జనసేనలో చేరిన తర్వాత లభిస్తుందనుకున్న ప్రాధాన్యత పై రాజకీయ నేతలకు ఉన్న అనుమానాలే. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. రాయలసీమ , ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న బాలినేని వంటి సీనియర్ నేత జనసేనలో చేరినప్పటికీ, ఆయనకు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించడం లేదనే అభిప్రాయం ఉంది. పైగా ఒంగోలు పరిసర నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామి అయిన టీడీపీ స్థానిక నేతలతో బాలినేనికి తరచూ విభేదాలు రావడం, కూటమి శ్రేణుల మధ్య ఘర్షణలు వాతావరణం నెలకొనడం వంటివి ఆయనకు మరింత ఇరకాటంగా మారాయి. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ విషయంలో అనుసరిస్తున్న కఠినమైన ఫిల్టరింగ్ విధానం కూడా ఈ వలసల వేగాన్ని తగ్గించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చే వారి విషయంలో పవన్ జాగ్రత్తలు వహిస్తున్నారు. గతంలో జనసేనను, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో విమర్శించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను, ,నియోజకవర్గాల్లో వివాదాస్పద ఇమేజ్ ఉన్న వారిని పార్టీలోకి చేర్చుకోవడానికి ఆయన సుముఖంగా లేరు. దీంతో పార్టీలోకి రావాలని ఆశపడే నేతలకు కనీసం గ్రీన్ సిగ్నల్ కూడా లభించని పరిస్థితి నెలకొంది. అధికారిక ప్రాధాన్యత , నియోజకవర్గాల్లో పట్టు సాధించే క్రమంలో టీడీపీయే సరైన వేదిక అని జంపింగ్ నేతలు భావిస్తున్నారు. పాత వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు నియోజకవర్గ స్థాయి వ్యవస్థలపై, అధికారులపై ప్రభావం చూపగలిగే బలమైన కేడర్ అవసరం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బలమైన యంత్రాంగం ఉంది. జనసేన ఓటు బ్యాంకు బలమైనదే అయినప్పటికీ, నియోజకవర్గంలో రాజకీయం నడపాలంటే టీడీపీ అధికారిక చత్రం కింద ఉండటమే రక్షణ అని సీనియర్ నాయకులు లెక్కింపులు వేస్తున్నారు. జనసేన ఎకో సిస్టమ్‌లో ఇమడలేమని ఎక్కువ మంది భావన జనసేన అంతర్గత నిర్మాణం, నిర్ణయాల ప్రక్రియ కూడా ఇక్కడ ఒక అంశంగా మారింది. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కోటరీ , పరిమితమైన పార్టీ పదవుల కేటాయింపు వల్ల, కొత్తగా చేరే వైఎస్‌ఆర్‌సీపీ మాజీ సీనియర్లకు సముచిత స్థానం దక్కుతుందా లేదా అనే సంశయం ఉండిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతాన్ని చూసిన తర్వాత చాలామంది వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్లు జనసేనలోకి వెళ్లి మూలన పడేకంటే, నేరుగా టీడీపీ లోకి వెళ్లి తమ ఉనికిని చాటుకోవడమే మేలు అనే ముగింపునకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ప

Original source: telugu.abplive.com
Read more on Kaizer News