Kaizer News

Shamirpet Road Accident | టైర్‌ మార్చుతుండగా టాటా

Shamirpet Road Accident | టైర్‌ మార్చుతుండగా టాటా ఏస్‌ను ఢీకొట్టిన డీసీఎం..

· State - Telangana · prabhanews.com

ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం మేడ్చల్‌, ఆంధ్రప్రభ: మేడ్చల్‌ జిల్లా షామీర్‌పేటలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో టాటా ఏస్‌ వాహనాన్ని డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం ప్రకారం.. టాటా ఏస్‌ వాహనం టైర్‌ పంక్చర్‌ కావడంతో రోడ్డు పక్కన నిలిపి, అందులోని వ్యక్తులు టైర్‌ మారుస్తున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి టాటా ఏస్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను నాచారం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Original source: prabhanews.com
Read more on Kaizer News