Kaizer News

పికిల్ బాల్ లీగ్‌కు స్టార్ అట్రాక్షన్.. గంటా, నితీ

పికిల్ బాల్ లీగ్‌కు స్టార్ అట్రాక్షన్.. గంటా, నితీష్ రెడ్డి సందడి

· State - Telangana · prabhanews.com

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రా పికిల్ బాల్ లీగ్ ‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీమిండియా క్రికెటర్ కె. నితీష్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించారు. వీరు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో పికిల్ బాల్ క్రీడకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడిన 8 జట్ల మధ్య ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న విజయవాడలో ప్రారంభమైన ఈ లీగ్‌లో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖలో మ్యాచ్‌లు నిర్వహించారు. శనివారం నాలుగు మ్యాచ్‌లు జరగగా.. ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. పోటీలను వీక్షించిన గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ నగరం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదికగా మారుతోందన్నారు. ఐపీఎల్ తరహాలో పికిల్ బాల్ లీగ్‌ను నిర్వహిస్తున్న ఆంధ్ర పికిల్ బాల్ అసోసియేషన్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు తో పాటు నిర్వాహకులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో పికిల్ బాల్ అభివృద్ధికి ఇలాంటి టోర్నీలు దోహదపడతాయని పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News