Kaizer News

తిరుమలలో స్వర్ణ రథయాత్రలో పాల్గొన్న వసుంధర

తిరుమలలో స్వర్ణ రథయాత్రలో పాల్గొన్న వసుంధర

· State - Telangana · prabhanews.com

తిరుపతి, ఆంధ్రప్రభ : నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర తిరుమలలో శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు నిర్వహించిన స్వర్ణ రథయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ భక్తి ఛానల్‌ చైర్మన్‌ బి. శ్రీధర్‌ వర్మతో వసుంధర భేటీ అయ్యారు. ఇటీవల ఎస్వీబీసీ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీధర్‌ వర్మకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీధర్‌ వర్మ వసుంధరను కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఆమె ఆయన కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు శ్రీధర్‌ వర్మ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని వసుంధర ఆకాంక్షించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News