Kaizer News

Donald Trump | కీల‌క బిల్లుపై అమెరికా అధ్య‌క్షుడి

Donald Trump | కీల‌క బిల్లుపై అమెరికా అధ్య‌క్షుడి సంత‌కం.. భార‌త్, చైనాల‌పై సుంకాలకు ట్రంప్‌కు ఫుల్‌ ప‌వ‌ర్‌..!

· National - India · ntnews.com

Donald Trump : రష్యా, ఇరాన్, చైనా, భారత్ (Russia, Iran, China, India) లను ఒకేసారి దెబ్బతీసే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దాంతో రష్యా, ఇరాన్‌ (Russia, Iran) లపై ఆంక్షలను విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తోన్న భారత్, చైనాల (India, China) పై సుంకాల మోత మోగించేందుకు అధ్యక్షుడికి అధికారం దఖలు పడింది. ‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026’ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు బుధవారం సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గత నెలలోనే సెనెట్‌ ఆమోదించింది. ఇప్పుడు ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. దాంతో భారత్ (India), చైనా (China) తో సహా 10 దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ సర్కార్ భారీగా సుంకాలు విధించనుంది. ఈ చట్టంపై ఇప్పటికే భారత్‌ స్పందించింది. రష్యాపై ఆంక్షలను, తమపై సుంకాలను విధిస్తే అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు ముప్పు తప్పదని భారత్‌ హెచ్చరించింది. అమెరికా చర్యను చైనా తిరస్కరించింది. భద్రతామండలి ఆమోదంలేని ఏ చర్యనూ ఆమోదించబోమని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ స్పష్టంచేశారు. ఈ చట్టంతో ట్రంప్‌నకు మ‌రిన్ని అధికారాలు లభించినట్ల‌య్యింది. రష్యా నాయకత్వంపై ఆంక్షలు విధించే అవ‌కాశం ద‌క్కింది. ఇంధన రంగంపై ఆంక్షల విధించ‌వ‌చ్చు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకుంటూ చమురు సరఫరాచేసే నౌకల షాడో ఫ్లీట్‌పైనా ఆంక్షలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం దక్కుతుంది. రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేలా ఒత్తిడి తెస్తూ భారత్, చైనా వంటి దేశాలపై సుంకాల మోత మోగించే అధికారం ఉంటుంది

Original source: ntnews.com
Read more on Kaizer News