Kaizer News

పూర్ణకుంభంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఘన స్వాగతం

పూర్ణకుంభంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఘన స్వాగతం

· State - Telangana · prabhanews.com

శ్రీ పశుపతినాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్‌లోని శ్రీ పశుపతినాథ దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతించి స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు. అనంతరం శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీ పశుపతినాథ స్వామివారికి మంత్రి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, చెరువులు, కుంటలు నిండాలని, రైతులకు సాగునీరు సమృద్ధిగా అందాలని కోరుకున్నట్లు చెప్పారు. పాడిపంటలు సమృద్ధిగా పండి రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను అర్చకులు మంత్రికి వివరించగా, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మంత్రిని సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భవనారుషి, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News