Kaizer News

CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణ

CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి

· State - Telangana · telugu.abplive.com

సీఎం చంద్రబాబు 28,445 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రూ.8,874 కోట్ల విలువైన 399 ఎకరాల భూములు క్రమబద్ధీకరించబడ్డాయి, చరిత్రలో ఇదే తొలిసారి. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖపట్నం: ఏపీలో వేలాది పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగిస్తూ వారికి సొంతింటి కల సాకారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ. 8,874 కోట్ల విలువైన భూములపై 28,445 పేద కుటుంబాలకు హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపుతూ భాగంగా 11 మండలాల పరిధిలోని 399 ఎకరాల (19,33,853 చదరపు గజాల) ఆక్రమిత, నివాస భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. విశాఖపట్నం చరిత్రలోనే పెద్ద ఎత్తున భూముల రెగ్యులరైజేషన్ చేసి, పూర్తి యాజమాన్య హక్కులతో పట్టాలు అందించడం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు సభా ప్రాంగణం వద్ద నియోజకవర్గాలు, మండలాలు, వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 6 నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 6,555 కుటుంబాలు, విశాఖ పశ్చిమలో 5,093, విశాఖ నార్త్‌లో 2,601, పెందుర్తిలో 2,851, గాజువాకలో 6,134, భీమిలి నియోజకవర్గంలో 5,211 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేసి వారి సొంతింటి కలను సాకారం చేసింది ప్రభుత్వం. మండలాల వారీగా పరిశీలిస్తే.. విశాఖపట్నం రూరల్‌లో అత్యధికంగా 9,261 కుటుంబాలు లబ్ధి పొందగా, ములగాడలో 4,213, గాజువాకలో 4,353, గోపాలపట్నంలో 3,253, పెందుర్తిలో 2,722, పెదగంట్యాడలో 1,910, మహారాణిపేటలో 1,235, సీతమ్మధారలో 668, భీమిలిలో 464, ఆనందపురంలో 349, పద్మనాభం మండలంలో 17 కుటుంబాలకు ఇళ్ల స్థలాల హక్కులు లభించాయి. ఇళ్ల పట్టాల పంపిణీకి ముందు రోజు నుంచే విశాఖలోని పలు కాలనీల్లో పండగ వాతావరణం నెలకొంది. టీడీపీ , జనసేన , బీజేపీ కి చెందిన కూటమి నేతలు లబ్ధిదారులను ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. 35 నుండి 40 ఏళ్లుగా తాము ఉంటున్న ఇళ్లపై శాశ్వత హక్కులు లభించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పట్టాలు దక్కడంతో తమ నివాస స్థలాల విలువ రెండింతలు పెరిగిందని, తాము కూడా లక్షాధికారులమయ్యామని సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థలాలు కోల్పోతామనే భయంతో గడిపామని, పెద్దజాలరిపేట వాసులు నాటి టీడీఆర్ బాండ్ల స్కామ్ పరిస్థితులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ దశాబ్దాల కలను సాకారం చేసి నివాసాలపై పూర్తి హక్కులు కల్పించిందని, వారికి ఎన్నటికీ రుణపడి ఉంటామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. Frequently Asked Questions విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేపట్టారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్

Original source: telugu.abplive.com
Read more on Kaizer News