Kaizer News

తెలంగాణలో వరి టెన్షన్.. 55 లక్షల ఎకరాల్లో సాగు, నీ

తెలంగాణలో వరి టెన్షన్.. 55 లక్షల ఎకరాల్లో సాగు, నీటి కోసం రైతుల తిప్పలు

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్/మహబూబ్‌‌‌‌నగర్, వెలుగు: రాష్ట్రంలో అన్నదాతల నుంచి అధికారుల దాకా ‘వరి’ టెన్షన్ మొదలైంది. ఎల్​నినో కారణంగా ఈసారి వర్షాలు పడవని, వరి సాగుచేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ గతంలో కన్నా సాగు పెరిగింది. ఏకంగా 55 లక్షల ఎకరాలకు పైగా సాగవ్వడంతో ఇప్పుడు ఆ పంటను కాపాడుకోవడం కత్తి మీద సాములా మారింది. వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. అటు భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులపైనే ఆధారపడ్తున్నారు. వరి పొట్ట దశకు రావడం, ఎండలు మండుతుండడంతో నీళ్ల అవసరం పెరిగింది. ఊట తగ్గిన బోర్ల నుంచి నీటిని తోడేందుకు రైతన్నలు రికాం లేకుండా కరెంట్ మోటార్లు నడిపిస్తున్నారు. దీంతో కరెంట్ వినియోగం చుక్కలను తాకుతోంది. వ్యవసాయానికి రికార్డు స్థాయిలో రోజూ 6 వేల నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ వాడకం జరుగుతున్నది. ఇంత చేసినా పంటకు సరిపడా నీళ్లు అందక చాలా చోట్ల ఎండిపోతున్నాయి. ఎల్ నినో కారణంగా ఈ వానాకాలం సరిపడా వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటాయని, వరి పంట సాగుచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. జులై​ నెలలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని కోరింది. రిజర్వాయర్లు నిండకపోతే సాగునీరు విడుదల చేయమని, తాగునీటి అవసరాలకే వాడుతామని స్పష్టంచేసింది. కానీ ప్రభుత్వ సూచనలు ఎక్కడ అమలుకాలేదు. పైగా ఈసారి పత్తిని మించి వరి పంట సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల 90 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇందులో 55.89 లక్షల ఎకరాల్లో అత్యధికంగా వరినాట్లు వేశారు. ఆ తర్వాత 48.32 లక్షల ఎకరాల్లో పత్తి , 5.93 లక్షల ఎకరాల్లో మక్క, 5.57 లక్షల ఎకరాల్లో కంది లాంటి పంటలు సాగుచేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3.45 లక్షల ఎకరాలు, సిద్ధిపేట జిల్లాలో 3.16 లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షలకు పైగా వ్యవసాయ కరెంట్ మోటార్లు ఉండగా నిత్యం 25 లక్షలకు మించి మోటార్లను రైతులు రికాం లేకుండా నడిపిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో ఎన్నడూ లేని రీతిలో వానాకాలంలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ వర్షపాతం ఉన్న సంవత్సరాల్లో రాష్ట్రంలో రోజుకు సుమారు11 వేల మెగావాట్లలోపే పీక్ డిమాండ్ ఉండేది. ఇప్పుడదీ ఏకంగా రోజుకు 19 వేల 500 మెగావాట్లు దాటిపోయింది. వర్షాలు బాగుంటే రిజర్వాయర్లు, చెరువులు నిండి భూగర్భజలాలు పెరగడంతో బోర్‌‌ వెల్ పంపింగ్ తగ్గి విద్యుత్ డిమాండ్ తగ్గేది. దీంతో వ్యవసాయ డిమాండ్ రోజుకు 3 వేల నుంచి 4 వేల మెగావాట్ల మధ్య ఉండేది. కానీ, ప్రస్తుతం వ్యవసాయ లోడ్ ఏకంగా రోజుకు 6 వేల నుంచి 7 వేలు దాటుతోందని సదరన్, నార్తర్న్, రైతు డిస్కమ్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో సరిగ్గా వానలు పడక భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే సగటున 2.09 మీటర్ల మేర క్షీణించాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల

Original source: v6velugu.com
Read more on Kaizer News