‘‘మనుషుల పనితీరులో కనిపించే సహజత్వం.. భావోద్వేగాల్ని ఏఐ సాంకేతికత తీసుకురాలేదు’’ అంటున్నారు ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేశ్. ఏఐ వల్ల లైవ్ ఆర్ట్ వర్క్‌కి ఎలాంటి నష్టం జరగదని.. అది డిజైనింగ్ ఆలోచనలకు లేదా రిఫరెన్స్‌లకు సహాయకారిగా ఉంటూ సమయాన్ని ఆదా చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు