Kaizer News

Nellore: నీట్ లీకేజీలపై జంతర్ మంతర్ ఉద్యమ స్ఫూర్తి

Nellore: నీట్ లీకేజీలపై జంతర్ మంతర్ ఉద్యమ స్ఫూర్తి ఆదర్శం: మాజీ ఎమ్మెల్సీ!

· State - Telangana · hmtvlive.com

నెల్లూరు: బద్దలైన నిశ్శబ్దం పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త శ్రీ విట్టపు బాల సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత Gen Z తరం దేశంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తూ, తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ముఖ్యంగా జంతర్ మంతర్ వేదికగా NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చిన ఉద్యమ స్ఫూర్తి వంటి అంశాలను ఈ తరం యువతలో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, వాటి ప్రభావం విద్యార్థులపై ఎలా ఉంటుందనే అంశాలపై విస్తృత చర్చ జరగాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, ప్రాథమిక విద్య, ఉపాధ్యాయుల పరిస్థితులు, విద్య అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. యువత తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలు, విద్యా హక్కు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని విట్టపు బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో UTF నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి. చలపతి శర్మ, UTF రాష్ట్ర కార్యదర్శి నావకోటేశ్వరరావు, UTF నెల్లూరు జిల్లా అధ్యక్షులు శేషు, UTF నెల్లూరు జిల్లా సభ్యులు , తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News