Kaizer News

స్థానికంగానే ఐటీ ఉద్యోగావకాశాలు

· State - Telangana · sakshi.com

ఆదిలాబాద్‌: జిల్లా యువతకు స్థానికంగానే ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ అన్నారు. ఎన్‌హెచ్‌ 44ను ఆనుకుని నిర్మాణం పూర్తయిన ఐటీ టవర్‌ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులతో కలిసి టవర్‌ను శనివారం సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు త్వరలో ఐటీ టవర్‌ను ప్రారంభించడంతో పాటు కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించేలా ఆహ్వానిస్తున్నట్లు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించే అవకాశాలున్నాయని వెల్లడించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఇన్‌చార్జి మంత్రి జూపలి కృష్ణారావు తదితరులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఐటీ కంపెనీలు ఆదిలాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇది జిల్లా అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బట్టిసావర్గాం సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దుర్గం శేఖర్‌, బాలూరి గోవర్ధన్‌రెడ్డి, గండ్రత్‌ సుజాత, సాజిద్‌ ఖాన్‌, గోక గణేశ్‌రెడ్డి, అంబకంటి అశోక్‌, బెజ్జంకి అనిల్‌, ప్రేమల తదితరులు పాల్గొన్నారు. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News