సీఎం రేవంత్‌రెడ్డిది అసత్యాల వరద, అబద్ధాల బురద అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని పేదల ఖాతాల్లో వెంటనే రూ.లక్ష కోట్లు వేస్తానంటే తమ పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తామని స్పష్టంచేశారు. ‘రేవంత్‌రెడ్డికి ఇకనైనా తన పిచ్చి ప్రచారాన్ని మానుకొని వెంటనే ముకునేలకు రాసి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నదంటూ ఇంతకాలం చేసిన ప్రచారం బెడిసికొట్టడంతో ఇప్పుడు లక్ష కోట్ల భూములంటూ కొత్త ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు