Kaizer News

ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?

ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?

· Entertainment · sakshi.com

రెండో వారాంతం పూర్తయినప్పటికీ 'ఇరుముడి' సినిమా థియేటర్లలో తెగ ఆడేస్తోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. దీంతో ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది. హీరో, దర్శకనిర్మాతల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ఎవరూ ఊహించని విజయం ఇదని చెప్పొచ్చు. ఇప్పటికీ జనాలు థియేటర్లకు వెళ్లి ఈ మూవీ చూస్తున్నారు. అదే టైంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఓ తేదీ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'టాక్సిక్' సినిమాకు నెగిటివ్ టాక్.. యష్ తల్లి ఆవేశం ) రవితేజకు గత కొన్నాళ్ల నుంచి సరైన సక్సెస్ అనేది లేదు. దీంతో 'ఇరుముడి'పై కూడా హైప్ ఓ మాదిరిగానే ఉండేది. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యం కావడంతో సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఇది కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మారు. వాళ్లకు నమ్మకాన్ని నిజం చేస్తూ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రూ.150 కోట్లకు పైనే వసూళ్లు దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇకపోతే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిబట్టి చూస్తే సెప్టెంబరు 18 నుంచే ఓటీటీ రిలీజ్ కావొచ్చు. లేదంటే నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో ఏమైనా మాట్లాడి ఇంకొన్ని వారాల స్ట్రీమింగ్ వాయిదా వేసేలా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. పరిస్థితులు చూస్తుంటే థియేటర్లలో మూవీ ఉన్నప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుందా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్ ) (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా ) వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ఢిల్లీలో నిర్భయ తరహాలో ఘటన.. స్లీపర్ బస్సులో బాలికపై.. 5 లక్షలకు 36 వేల వడ్డీ! పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్ లైవ్ లో మల్లెపూల పల్లకి పాటతో పూనకాలు తెప్పించిన ఇరుముడి సింగర్ డప్పు శీను నేనే ధీరుడిని.. పోటుగాడిని అనుకున్నాడు.. YSRCP నుండి బయటకు వెళ్ళాక సీన్ అర్థమైంది

Original source: sakshi.com
Read more on Kaizer News