Bapatla: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.పెనుమూడి - గంగడిపాలెం మార్గమధ్యంలో రోడ్డు మధ్యలో ఉన్న మర్రిచెట్టును బలంగా ఢీకొట్టిన ఆటో. ప్రమాదంలో వడ్డీవారిపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యేమినేని నాగ మహేష్ (32) అక్కడికక్కడే మృతి. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో జరిగిన దుర్ఘటన. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక అంచనా. నాగ మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. మృతుడికి కేవలం ఆరు నెలల క్రితమే పెళ్లి కావడంతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు. ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన రేపల్లె పోలీసులు