నిజాంపేట, ఆంధ్రప్రభ: నందగోకుల్–నస్కల్–చెల్మెడ కమాన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నందగోకుల్ నుంచి చెల్మెడ కమాన్ వరకు సాగిన పాదయాత్రలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందగోకుల్‌లోని హనుమాన్ దేవాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల కష్టాలు తీర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నందగోకుల్–నస్కల్–చెల్మెడ కమాన్ మధ్య రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గుంతలు, కంకర, బురదతో వర్షాకాలంలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందన్నారు. రైతులు, వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారి దుస్థితి కారణంగా విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన ఆర్టీసీ బస్సు సేవలు కూడా నిలిచిపోయాయని, దీంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారని పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన మేరకు కొంతమేర పనులు జరిగాయని, కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. బిల్లులను వెంటనే చెల్లించి మిగిలిన రహదారి పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో రహదారి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాలని, లేకుంటే నందగోకుల్, నస్కల్, చెల్మెడ ప్రాంతాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రోడ్డు పూర్తయ్యే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రహదారి పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పాదయాత్రను చూసైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లావణ్యరెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, జీవన్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు బాజా చంద్రం, బాపురెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, మాజీ ఎంపీ