Kaizer News

ఏకపాద సేతుబంధాసనం, లాభాలు, జాగ్రత్తలు

ఏకపాద సేతుబంధాసనం, లాభాలు, జాగ్రత్తలు

· State - Telangana · sakshi.com

ఒక కాలును పైకి లేపి సాధన చేసే భంగిమనే ఏకపాద సేతుబంధాసనం అంటారు. ఇది వెన్నెముక, నడుము, తొడలు, పొట్ట కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడే యోగాసనం. చేసే విధానం.. ముందుగా యోగా మ్యాట్‌పై వెల్లకిలా (వెనుక భాగం నేలకు ఆనేలా) పడుకోవాలి. చేతులను ఇరుపక్కలా ఉంచాలి. రెండు మోకాళ్లను పైకి మడిచి,పాదాలను నడుముకు వీలైనంత దగ్గరగా, నేలపై బలంగా ఉంచాలి. రెండుపాదాల మధ్య కొద్దిగా దూరం ఉండాలి. నడుము పైకి లేపుతూ గాలి పీలుస్తూ నడుము, తుంటి, వెన్నుభాగాన్ని పైకి లేపాలి. మీ చేతులు నేలపైనే ఉండాలి. లేదా రెండు చేతుల వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి శరీరం కింద లాకప్‌ చేయవచ్చు. ఇప్పుడు శరీరాన్ని స్థిరంగా ఉంచి, శ్వాస వదులుతూ కుడి కాలును నిటారుగా పైకి (ఆకాశం వైపు చూసేలా) లేపాలి. మీ బరువంతా ఎడమపాదం, భుజాలు, తలపై సమానంగా బ్యాలెన్స్‌ అవ్వాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 30 సెకన్లు ఉండాలి. గాలి వదులుతూ మెల్లగా కుడి కాలును కిందకు దించి, ఆపై నడుమును నేలకు ఆనించాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఇదే ప్రక్రియను ఎడమ కాలును పైకి లేపి తిరిగి చేయాలి. ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్‌ : చీరకట్టుతో నటి ఫిట్‌నెస్‌ ఫీట్‌ ప్రయోజనాలు ఈ ఆసనం వెన్నుముకను, నడుము కండరాలను, పిరుదులను బలపరుస్తుంది. మెడ భాగంపై ఒత్తిడి పడటం వల్ల థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట భాగం సాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారి, మలబద్ధకం తగ్గుతుంది. ∙ మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి ఒత్తిడి,ఆందోళన, అలసట తగ్గుతాయి. ఒక కాలిపై శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయడం వల్ల ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి. తీవ్రమైన మెడ నొప్పి, వెన్నుముక సమస్యలు లేదా డిస్క్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని అస్సలు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటే కాలుపై బరువు పెట్టడం మంచిది కాదు. గర్భిణులు గర్భధారణ సమయంలో ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. ఇదీ చదవండి: పాత చేనేతలకు కొత్త కళ..ఇలా ట్రై చేశారా? బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ

Original source: sakshi.com
Read more on Kaizer News