ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి పి వెంకటరమణారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను సమర్పించారు. వివిధ అంశాలపై సర్పంచులు అడిగిన ప్రశ్నలకు పలువురు అధికారులు సమాధానాలు ఇచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, సర్పంచులు జూకంటి అనిల్, యాదిరెడ్డి, వడ్ల శోభన్‌బాబు, మొగులగాని నర్సయ్య, పశుల సతీష్ రెడ్డి, బోరిలాల్, ఆయా శాఖల సిబ్బంది, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు