Kaizer News

ప్రతిభకు పట్టం.. పద్మశాలి విద్యార్థులకు పురస్కారాల

ప్రతిభకు పట్టం.. పద్మశాలి విద్యార్థులకు పురస్కారాలు

· State - Telangana · prabhanews.com

అచ్చంపేట, ఆంధ్రప్రభ: 46వ నూలు పూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా అచ్చంపేట పట్టణంలోని శ్రీభక్త మార్కండేయ పద్మశాలి కమ్యూనిటీ హాల్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన పద్మశాలి విద్యార్థులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. ఇంటర్మీడియట్‌లో 983 మార్కులు సాధించిన పులిజాల ప్రణదీప్‌కు ప్రథమ బహుమతి, 947 మార్కులు సాధించిన ఇమ్మడి మణిదీప్‌కు ద్వితీయ బహుమతి అందించారు. పదో తరగతిలో 571 మార్కులు సాధించిన సాక నక్షత్రకు ప్రథమ బహుమతి, 568 మార్కులు సాధించిన గంజి షణ్ముఖప్రియకు ద్వితీయ బహుమతి అందజేశారు. అలాగే 46వ నూలు పూర్ణిమ ఊరేగింపు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన కోలాటం మాస్టర్ కర్నాటి నవీన్‌, దాసపత్రి శకుంతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు సేవలందించిన వారిని గుర్తించి అభినందించడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కోట కిషోర్‌, ప్రధాన కార్యదర్శి పులిజాల రమేష్‌, కోశాధికారి దాసు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పులిజాల యాదగిరి, మ్యాకల సత్యనారాయణ, శివాలయ కమిటీ అధ్యక్షుడు వనం పర్వతాలు, మహిళా సంఘం అధ్యక్షురాలు దాసుపత్రి శకుంతల, గుర్రం హైమావతి, గుర్రం మల్లికార్జున్‌, గంజి రమేష్‌, పులిజాల భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News