శతకంతో రంగలక్ష్మి విధ్వంసం రాయలసీమకు అదిరిపోయే ఆరంభం గోదావరిపై 7 వికెట్ల తేడాతో విజయం వైజాగ్‌పై అమరావతికి 17 పరుగుల గెలుపు పద్మజ ఆల్‌రౌండ్ మెరుపులు మంగళగిరిలో మహిళా క్రికెట్ సందడి ఆంధ్రప్రభ : మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్ తొలి రోజే బ్యాట్–బంతి మధ్య ఆసక్తికర పోరుకు వేదికైంది. ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాయలసీమ జెన్ స్టార్స్, అమరావతి ఈ ఛాంపియన్స్ విజయాలతో బోణీ చేశాయి. తొలి మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్‌పై రాయలసీమ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌పై అమరావతి 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకవైపు పద్మజ ఆల్‌రౌండ్ ప్రతిభతో మెరిస్తే.. మరోవైపు రంగలక్ష్మి అజేయ శతకంతో స్టేడియంలో పరుగుల పండగ పంచారు. టాస్ గెలిచిన రాయలసీమ జెన్ స్టార్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కెప్టెన్ హేన్రిట్టా పెరీరా జట్టుకు అండగా నిలిచారు. 49 బంతులు ఎదుర్కొన్న ఆమె ఆరు ఫోర్లతో 63 పరుగులు చేశారు. గుండుపల్లి ఉద్విత 36 బంతుల్లో 30 పరుగులు సాధించారు. రాయలసీమ బౌలర్లలో బి.అనూష మూడు వికెట్లు తీయగా.. ఈ.పద్మజ రెండు వికెట్లతో సత్తా చాటారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ సేతు సాయి 23 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 33 పరుగులు చేసి వేగంగా పరుగులు రాబట్టారు. మరో ఓపెనర్ శుభశ్రీ 40 బంతుల్లో 23 పరుగులతో ఇన్నింగ్స్‌కు పునాది వేశారు. అనంతరం పద్మజ బ్యాట్ ఝుళిపించడంతో లక్ష్యం మరింత చేరువైంది. కేవలం 18 బంతుల్లో ఐదు ఫోర్లతో 30 పరుగులు చేసిన ఆమె.. 17.3 ఓవర్లలోనే జట్టును 120 పరుగులకు చేర్చారు. మూడు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన రాయలసీమ శుభారంభం చేసింది. బంతితో గోదావరి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసిన పద్మజ.. బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించారు. రెండు వికెట్లతో పాటు 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో రాయలసీమ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. తొలి మ్యాచ్‌లోనే బ్యాట్, బంతి రెండింటిలోనూ తన ముద్ర వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో మ్యాచ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్ బ్యాట్ ఝుళిపించింది. వైజాగ్ ఫైర్ బర్డ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన అమరావతి 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ రంగలక్ష్మి ఆకాశమే హద్దుగా చెలరేగారు. 74 బంతుల్లో 102 పరుగులతో అజేయ శతకం సాధించారు. ఆమె ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. వన్‌డౌన్‌లో వచ్చిన దీక్షా కాట్రగడ్డ కూడా ధాటిగా ఆడి 30 బంతుల్లో 43 పరుగులు చేశారు. ఆమె ఖాతాలో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ ఫైర్ బర్డ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓపెనర్ పుష్ప 40 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 63 పరుగులు చేసి పోరాటం చ