Kaizer News

Atmakur: వీఆర్వో రోడ్డు ప్రమాదంపై పోలీసుల తీరును ఖ

Atmakur: వీఆర్వో రోడ్డు ప్రమాదంపై పోలీసుల తీరును ఖండించిన సంఘం నాయకులు

· State - Telangana · hmtvlive.com

Shorts ఆత్మకూరు: గతంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయిలచిరివెళ్ల విఆర్ఓగా పనిచేస్తూ ప్రస్తుతం కలువాయి మండలం చీపినాపీ గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న హరిబాబు ఈనెల 17వ తేదీన వారి తండ్రి తో కలిసి విధులకు వెళుతున్న సమయంలో చేజర్ల మండలంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని పదవి విరమణ చేసిన ఏఎస్ఐ కారు ఢీకొని వేగంగా వెళ్లిపోయింది. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్న పోలీసులు నిన్న రాత్రి FIR నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఈ ప్రమాద ఘటనపై పోలీసులు ఎటువంటి ప్రాథమిక విచారణ జరపలేదని ఆరోపిస్తూ జిల్లా రెవెన్యూ కార్యవర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి దారా. వెంకట రమణయ్య,వారి కార్యవర్గ సభ్యులు నేడు ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న హరిబాబును,తండ్రిని పరామర్శించారు.. ఈ క్రమంలో జరిగిన ప్రమాద తీరును ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని వారు మీడియాతో మాట్లాడారు. ప్రాణం పోయే ప్రమాద తీవ్రత ఏర్పడిన ప్రమాదానికి కారణమైన విశ్రాంత ఏఎస్ఐ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని అన్నారు.. పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తి కావడంతో వారిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు ఆసక్తి చూప లేదని అన్నారు.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వీరికి న్యాయం జరగని పక్షంలో దీనిపై రేపు తాము జిల్లా కార్యవర్గ సభ్యులతో జిల్లా ఎస్.పి ని మరియు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News